జిల్లాలో మహిళ దారుణ హత్య..!

జిల్లాలో మహిళ దారుణ హత్య..!

CTR: జిల్లాలో అదృశ్యమైన మహిళ హత్యకు గురైనట్లు తెలుస్తోంది.పెద్దపంజాణి మండలం ముద్దేపల్లికి చెందిన చంద్రమ్మ వడ్డీ వ్యాపారం చేసేది. ఈక్రమంలో రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు విచారించగా సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి బైక్ తీసుకెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు అతడిని విచారించగా హత్య చేసి జగమర్ల అడవిలో పారవేసినట్లు తెలుస్తోంది.