విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

నిర్మల్: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి చెందిన ఘటన కుబీర్‌లో చోటుచేసుకుంది. చొండి గ్రామానికి చెందిన శోభ ఇంట్లో సోమవారం ఉదయం విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇంట్లో నిల్వ ఉంచిన పత్తికి పందికొక్కుల బెడద ఎక్కువ కావడంతో విద్యుత్ అమర్చారు. ఉదయం చూసుకోకుడా తీగకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కాపాడేందుకు ప్రయత్నించిన కుమారుడికి గాయాలు అయ్యాయి.