రైతు బీమా దరఖాస్తులకు రేపే చివరి తేదీ

KNR: కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఈనెల 13లోగా రైతు బీమా కోసం వ్యవసాయ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకొని బీమా సౌకర్యం పొందాలని ఏఈవో ప్రశాంత్ ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 5లోపు పట్టాదారు పాస్ పుస్తకం పొందినవారు, గతంలో రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోనివారు చేసుకోవాలని, 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారై ఉండాలని అన్నారు.