VIDEO: 'రోడ్లపై కొబ్బరి బొండాలు పడేస్తే కఠిన చర్యలు'
కాకినాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతుంటే కొందరు వ్యక్తులు కొబ్బరి బోండాలు రోడ్డుపై పడేస్తున్నారని కాకినాడ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ సుధాకర్ అన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం ఆయన సామర్లకోట, యానం రోడ్లలో పర్యటించారు. కొబ్బరి బొండాల వ్యాపారులు పడేసిన వ్యర్ధాలు చూసి వారిపై మండిపడ్డారు.