నేడు ఒంగోలులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు ఒంగోలులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

ఒంగోలు నగరంలో కేశవ స్వామి రథోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లుగా విద్యుత్ శాఖ డీఈ వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు ఒంగోలు నగరంలోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని, కావున ఒంగోలులోని విద్యుత్ వినియోగదారులు తమకు సహకరించాలని పేర్కొన్నారు.