VIDEO: ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించేందుకు చర్యలు
కృష్ణా: గుడివాడ మున్సిపాలిటీలో ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు మున్సిపల్ సిబ్బంది శనివారం దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 12 దుకాణాలు నిషేధిత ప్లాస్టిక్ వినియోగాన్ని గుర్తించారు. 28 కిలోల ప్లాస్టిక్ పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన దుకాణాలపై రూ.18,000 జరిమానా విధించారు.