చివరి దశకు అమెరికా-భారత్ ట్రేడ్ డీల్
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం చివరి దశకు చేరినట్లు అగ్రరాజ్య డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ వెల్లడించారు. భారత్ పర్యటనలో భాగంగా క్రిస్టోఫర్ ఈ విషయాన్ని వెల్లడించారు. వాణిజ్య ఒప్పందంలో అమెరికా ఆర్థిక ప్రయోజనాలు కచ్చితంగా ప్రతిబింబించాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుంకాలు చెల్లవని అమెరికా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ ఒప్పందంపై భారత్ వెనక్కి తగ్గింది.