ఉత్తమ్‌.. దమ్ము ఉందా..?: బీజేపీ ఎమ్మెల్యే

ఉత్తమ్‌.. దమ్ము ఉందా..?: బీజేపీ ఎమ్మెల్యే

TG: HILT పాలసీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి BJP ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జర్నలిస్టుల సమక్షంలో చర్చకు సిద్ధమా? అని సూటిగా ప్రశ్నించారు. బహిరంగ చర్చకు వచ్చే దమ్ము ఉత్తమ్‌కు ఉందా? అని నిలదీశారు. దీనిపై మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.