జిల్లా ప్రజావాణిలో సమస్య పరిష్కారం కాకుంటే ఇక్కడికి రండి!
HYD: హైదరాబాదులోని మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్‌లో ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది. ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలు, అభ్యర్థనలు నేరుగా ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం ఉందని అధికారులు చెబుతూ, జిల్లా ప్రజావాణిలో సమస్య పరిష్కారం కాకుంటే ఇక్కడికి రావచ్చన్నారు.