ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు రెవెన్యూ డివిజన్ పరిధిలో సొంతిల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. బుధవారం ఆర్డీవో కిడారి సందీప్ కుమార్ ప్రకటన ప్రకారం, జిల్లాలో అర్హులైన వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. రూరల్ పరిధిలో 3 సెంట్లు, అర్బన్ పరిధిలో 2 సెంట్ల స్థలాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.