దరఖాస్తుల ఆహ్వానం

RR: షాద్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని ఎలికట్ట అంబా భవాని మాత ఆలయ ధర్మకర్తల మండలి పదవులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆలయ ఈఓ శివకుమార్ తెలిపారు. అంబా భవానీ మాత దేవాలయం ధర్మకర్తల మండలి కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 27లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.