జనసేన ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఎలక్ట్రికల్ ప్రభ
మార్కాపురంలోని శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జనసేన పార్టీ కంభం రోడ్డులో ఎలక్ట్రికల్ ప్రభలు ఏర్పాటు చేసింది. దేవాదాయశాఖ ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. పలు రాజకీయ పార్టీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి మరికొద్దిసేపట్లో సినీ ప్రముఖులు, జబర్దస్త్ ఆర్టిస్టులు, రాజకీయ ప్రముఖులు హాజరవుతారన్నారు.