పీయూ బీఈడీ మూడో సెమిస్టర్ టైమ్ టేబుల్ విడుదల

పీయూ బీఈడీ మూడో సెమిస్టర్ టైమ్ టేబుల్ విడుదల

MBNR: మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా పాలమూరు యూనివర్సిటీ పరిధిలో బీఈడీ 3వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల టైమ్ టేబుల్ యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ప్రతి రోజు పరీక్షలను మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు పూర్తి టైమ్ టేబుల్ యూనివర్సిటీ వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. విద్యార్థులు గమనించాలని కోరారు.