ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
NDL: వెలుగోడు ఏపీ మోడల్ జూనియర్ కాలేజీలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రవేశాలు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ నళిని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఏప్రిల్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 3న ఎంపిక జాబితా, 6న ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తు ఫీజు BC, OC విద్యార్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీలకు రూ.150గా ఉంది.