సన్యాసయ్య స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
VZM: మహాశివరాత్రి సందర్భంగా ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కుటుంబ సమేతంగా సన్యాసయ్య స్వామిని ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆనంతరం ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన మహా అన్న సమారాధనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.