‘చర్చను అడ్డుకోవడమే అసలైన డ్రామా’
'పార్లమెంట్‌లో డ్రామాలు వద్దు' అని ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ కు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ గట్టి కౌంటర్ ఇచ్చారు. కాలుష్యం, SIR లాంటి సీరియస్ సమస్యలపై మాట్లాడితే డ్రామా అంటారా? అని నిలదీశారు. అసలు పార్లమెంట్ ఉన్నదే చర్చించడానికి.. ఆ చర్చ జరగనివ్వకుండా అడ్డుకోవడమే నిజమైన డ్రామా అని మోదీకి చురకలు అంటించారు. ప్రజా సమస్యలు తమకు డ్రామా కాదని తేల్చిచెప్పారు.