షాద్ నగర్‌లో కదలని బస్సులు.. ప్రయాణికుల అవస్థలు

షాద్ నగర్‌లో కదలని బస్సులు.. ప్రయాణికుల అవస్థలు

RR: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా షాద్ నగర్ డిపోలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బస్సులు కదలకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మరి కొంతమంది ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆర్టీసీ బస్సుల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.