'కాంట్రాక్ట్ కార్మికులకు ESI అమలు చేయాలి'
PDPL: సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు ESI అమలు చేయాలని GM బండి వెంకటయ్య సూచించారు. నిన్న కాన్పరెన్స్ హాలులో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ESI చట్టం (ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్) అమలు విషయంపై విస్తృతంగా చర్చించడంతో పాటు, కాంట్రాక్టర్ ఉద్యోగులకు లభించే లాభాలు, సౌకర్యాలు కాంట్రాక్టర్లు తప్పనిసరిగా అమలు చేయాలన్నారు.