ఉగ్రవాదాన్ని వాడుకుంటున్న పాక్: అమెరికా
పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అరికట్టడంలో విఫలమైందని అమెరికా కాంగ్రెస్ నివేదిక వెల్లడించింది. పాక్‌లో ఉగ్ర కార్యకలాపాలు 1980 నుంచి కొనసాగుతున్నాయని పేర్కొంది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలు పాక్ గడ్డపై నుంచే కార్యకలాపాలు సాగిస్తూ దక్షిణాసియా శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని హెచ్చరించింది. కొన్ని ఉగ్ర సంస్థలను పాక్ ప్రభుత్వం తన ప్రయోజనాల కోసం వాడుకుంటోందని తెలిపింది.