మేడారం వెళ్లే భక్తులకు హెచ్చరిక..

MLG: ములుగు జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోవిందరావుపేట మండలం పస్రా-మేడారం మార్గంలో బాంబులమోరి వద్ద నీటి ప్రవాహం పెరిగింది. మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వెళ్లే భక్తులు పస్రా-నార్లపూర్ మార్గం బదులు తాడ్వాయి గుండా మేడారం చేరుకోవాలని పోలీసులు శనివారం సూచించారు.