తాడేపల్లిగూడెంలో నకిలీ విలేఖరులు హల్‌చల్

WG: తాడేపల్లిగూడెం పట్టణంలో జట్లపాలెం రోడ్డులో ముగ్గురు నకిలీ విలేకరులు హల్చల్ సృష్టించారు. ఒక ఐచర్ వ్యాన్‌ను అడ్డగించి, తాము పత్రికా విలేకరులమని చెప్పుకుని డబ్బు డిమాండ్ చేశారు. ఈ ఘటన పోలీసుల దృష్టికి రావడంతో, సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. నిడమర్రు మండలానికి చెందిన ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని, ఆదివారం రాత్రి కేసు నమోదు చేసినట్లు సమాచారం.