పోలీసు త్యాగాలపై విద్యార్థులకు సెమినార్
ATP: పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు 'పోలీసుల త్యాగాలు' అనే అంశంపై స్థానిక కాన్ఫరెన్స్ హాల్లో సెమినార్ నిర్వహించారు. ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేష్ ప్రధాన వక్తగా పాల్గొని పోలీసుల పని ఒత్తిడి, త్యాగాల ప్రాముఖ్యతను వివరించారు.