గో మాంసం విక్రయాలను అరికట్టాలి: సజ్జద్
CTR: పుంగనూరులో గో మాంసం విక్రయాలను అరికట్టేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సజ్జద్ డిమాండ్ చేశారు. ఆదివారం పుంగనూరు పట్టణంలో ఆయన మాట్లాడారు. భారతీయ సంస్కృతిలో గోవులకు అత్యంత ప్రాముఖ్యత ఉందన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా జరుగుతున్న గో మాంస విక్రియాలు, అక్రమ రవాణా తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేశారు.