నిండు కుండలా కడెం ప్రాజెక్ట్.. ఒక గేటు ఎత్తివేత

నిండు కుండలా కడెం ప్రాజెక్ట్.. ఒక గేటు ఎత్తివేత

NRML: కడెం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి ఉండటంతో వస్తున్న ఇన్ ప్లోను అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం ఉదయం 4,507 క్యూసెక్కుల వరద రాగా ఒక వరద గేటును ఎత్తి 4,178 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. నిండు కుండలా కడెం ప్రాజెక్టు చూపరులను ఆకట్టుకుంటోంది.