VIDEO: రేపు హోలీ జరుపుకోవాలి.. చిట్యాలలో టామ్ టామ్

VIDEO: రేపు హోలీ జరుపుకోవాలి.. చిట్యాలలో టామ్ టామ్

NLG: హోలీ పండుగ తేదీపై నెలకొన్న సందిగ్ధతకు చిట్యాల మున్సిపల్ పాలకవర్గం తెరదించింది. అఖిలపక్ష నాయకులు, కుల సంఘాలు, అర్చకులు వాసుదేవ శర్మతో నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం నేడు కామదహనం, మంగళవారం హోలీ పండుగ జరుపుకోవాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు మున్సిపల్ అధికారులు పట్టణంలో డప్పు చాటింపు చేయించారు.