పంతినిలో "Arrive Alive” అవగాహన కార్యక్రమం
HNK: ఐనవోలు మండలం పంతిని గ్రామం వద్ద ఖమ్మం హైవే రోడ్డుపై బుధవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “Arrive Alive” అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మామునూరు ఏసీపీ పాల్గొని మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ పాటించడం, ఎడమవైపు ఓవర్‌టేక్ చేయకూడదని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు.