గురు వైభవ ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం
KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి గురు వైభవ ఉత్సవాలకు రావాలని ఆదివారం సీఎం చంద్రబాబుకు మఠం ప్రతినిధులు ఆహ్వానించారు. అసిస్టెంట్ మేనేజర్, PRO ఐపీ నరసింహామూర్తి, అనంత్ పురాణిక్ సీఎంకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈనెల 19 నుంచి 24 వరకు ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. అనంతరం వారు మంత్రాక్షితలు, ప్రసాదం అందజేసి పీఠాధిపతితో ఫోన్లో మాట్లాడించారు.