ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించిన మున్సిపల్ ఛైర్‌పర్సన్
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 23వ వార్డులో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. వేసవి దృష్ట్యా వాటర్ క్యూరింగ్ ఎక్కువగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సుల్తానా బేగం యూనుస్, ఆన్వార్, కళ్లెం సత్యం, కాళ్ళ గణేష్, వాజీద్, చిట్టి బాబు, సిద్దిక్, బంగారు దేవదాస్, పాల్గొన్నారు.