'కమర్షియల్ గ్యాస్‌పై ఇప్పటికే బ్లాక్ మార్కెట్ నడుస్తుంది'
AP: గ్యాస్ కొరతపై విశాఖ హోటల్ మర్చెంట్ సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ స్పందించారు. 'విశాఖలో నెలకు 70 వేల కమర్షియల్ సిలిండర్లు అవసరం. ప్రస్తుతం నెలకు 12 వేల సిలిండర్లే వస్తున్నాయి. రేపట్నుంచి మరింత తగ్గవచ్చు. ఇప్పటికే బ్లాక్ మార్కెట్ నడుస్తుంది. ఇలాగే ఉంటే నిర్వహణ కష్టంగా మారుతోంది. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చాం. గ్యాస్ కొరత లేకుండా మోదీ, చంద్రబాబు చూడాలి' అని కోరారు.