పుంగనూరులో వైభవంగా తెప్పదేవర

పుంగనూరులో వైభవంగా తెప్పదేవర

CTR: పుంగనూరు రూరల్ ముడిపాపనపల్లి గ్రామంలో గురువారం గ్రామస్తులు తెప్పదేవరను వైభవంగా నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో దీపాలకు పూజలు నిర్వహించి గ్రామ దేవత అయిన గంగమ్మకు సమర్పించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా అలంకరించిన తెప్పలో దీపాలను ఏర్పాటు చేసి గ్రామంలోని చెరువులో విడిచారు. ఈ తెప్పదేవరలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.