గ్రానైట్ కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలి: AITUC
KMM: రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న గ్రానైట్ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వమే పరిష్కరించి, ఆదుకోవాలని AITUC జిల్లా అధ్యక్షుడు గాదె లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. శనివారం ముదిగొండలోని కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రానైట్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే కృషి చేయాలని కోరారు.