మరి కాసేపట్లో జిల్లాకు సీఎం

మరి కాసేపట్లో జిల్లాకు సీఎం

MDK: ప్రజా పాలన విజయోత్సవాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కొద్ది సేపట్లో జిల్లాకు రానున్నారు. ఈ సందర్భంగా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. రూ.44.12 కోట్లు వ్యయంతో SU ఇంజనీరింగ్ కాలేజీకి, రూ.58.91 కోట్లతో హుస్నాబాద్- అక్కన్నపేట 4 లేన్ రోడ్డుకు శంఖుస్థాపన చేయనున్నారు. అలాగే మున్సిపాలిటీ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.