బీసీ కళాశాలను సందర్శించిన మంత్రి

బీసీ కళాశాలను సందర్శించిన మంత్రి

E.G: బీసీ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సవిత తెలిపారు. రాజమండ్రిలోని బీసీ కళాశాల బాలికల హాస్టల్‌ను MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి సోమవారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. ఈ మేరకు హాస్టల్ గదులు, మరుగుదొడ్లు పరిశీలించారు. బీసీ విద్యార్థుల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు.