మార్కెట్ వేలంను దక్కించుకున్న బలిఘట్టం వాసి
VZM: కొత్తవలస మేజర్ పంచాయతీ కార్యాలయ రోజువారి మార్కెట్ బహిరంగ వేలం 2026-27కు సంబంధించి శనివారం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ వేలం పాటకు ఔత్సాహికులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పాటలో తుదకు బలిఘట్టం గ్రామానికి చెందిన బీ.రవణమ్మ రూ.9.50 లక్షలు రోజువారి పాటను కైవసం చేసుకున్నారు.