జనగణన కోసం అధికారులు నియమాకం

జనగణన కోసం అధికారులు నియమాకం

వరంగల్: జిల్లాలో నిర్వహించనున్న జనగణన కోసం 8,675 మంది సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు కొనసాగనుందని పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రత్యేకంగా 2,118 మందిని కేటాయించినట్లు వెల్లడించారు. ప్రతి ఎన్యూమరేటర్ సుమారు 700 నుంచి 800 మంది జనాభా వివరాలను సేకరించాలని అధికారులు సూచించారు.