ప్రారంభమైన పోలింగ్..

NLG: వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మూడు ఉమ్మడి జిల్లాల్లోని 605 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరగనుంది.