CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: పెడన టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని 24 మంది లబ్దిదారులకు రూ. 29,84,869 CMRF చెక్కులను ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. అనారోగ్యానికి గురైన వారు ఆర్థిక పరిస్థితులతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు CMRF ఉపయోగపడుతుందని తెలిపారు. పేదలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.