'పోలింగ్ బూత్‌ల వద్ద ట్రాఫిక్ మళ్లింపు'

NZB: సోమవారం జరిగే లోక్‌సభ ఎన్నికల పోలింగ్ బూత్‌ల వద్ద ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్లు జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. పోలింగ్ బూత్‌లకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బూత్‌ల వద్ద ముందస్తు చర్యలు చేపడుతున్నామని అన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామబాద్, ఆర్మూర్, బోధన్ పట్టణాల్లో ఈ ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందన్నారు.