పోస్టల్ శాఖ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

GNTR: గుంటూరు జిల్లాలో 6-9 తరగతి విద్యార్థులకు పోస్టల్ శాఖ దీన్ దయాల్ స్పర్శ్ యోజన కింద ఉపకారవేతనం అందించనుంది. నెలకు రూ. 500 చొప్పున ఏటా రూ. 6 వేలు పొందవచ్చు. ఆసక్తి ఉన్న విద్యార్థుల వివరాలను పాఠశాలలు సెప్టెంబర్ 16 లోపు విజయవాడ పోస్టుమాస్టర్ జనరల్ కార్యాలయానికి పంపాలని సంబంధిత అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.