ఇంటి పన్ను చెల్లించకపోతే లీగల్ నోటీసులు
ASR: ప్రతి కుటుంబం విధిగా ఇంటి పన్ను చెల్లించాలని శనివారం చింతపల్లి ఎంపీడీవో సీతామహాలక్ష్మి సూచించారు. ఇంటి పన్ను చెల్లించిన వెంటనే, కుటుంబ యజమాని రశీదు తీసుకోవాలన్నారు. ఇంటిపన్ను పంచాయతీ అభివృద్ధికి వీలవుందన్నారు. చింతపల్లిలో ఏళ్ల తరబడి ఇళ్ల పన్ను చెల్లించని ఉపాధ్యాయులు, ఉద్యోగులకు నోటీసులు ఇచ్చామన్నారు. వారు స్పందించకుంటే లీగల్ నోటీసులు ఇస్తామన్నారు.