నెల రోజుల్లో మాతా శిశు కేంద్రం సిద్ధం కావాలి: కలెక్టర్
SRPT: మాతా శిశు కేంద్రం భవన నిర్మాణాన్ని నెల రోజుల్లోగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ తేజస్ నందా లాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆయన, అవసరమైన వైద్య పరికరాల కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. కోదాడలో శిశువును వదిలేసిన ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ, పిల్లలను వద్దనుకునే వారు ఆసుపత్రిలోని 'ఉయ్యాల'లో ఉంచాలని అన్నారు.