నూతన పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ

ప్రకాశం: వెలిగండ్ల మండలం పందువ గ్రామంలో పంచాయతీ భవన నిర్మాణానికి 32 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా శనివారం టీడీపీ నాయకురాలు తీట్ల చెన్న లక్ష్మీ భూమి పూజ చేశారు. మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 12 లక్షలు, పంచాయతీరాజ్ ద్వారా 20 లక్షల నిధులు మంజూరు అయినట్లు వారు తెలిపారు. నిధులు కేటాయించిన స్థానిక ఎమ్మెల్యే ఉగ్రకి గ్రామస్తులు అభినందనలు తెలిపారు.