కదిరిలో వ్యక్తిపై పోక్సో కేసు
సత్యసాయి: కదిరి మండలంలోని ఓ మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేశారు. తన 8ఏళ్ల కూతురు శుక్రవారం స్థానిక అంగన్వాడీ స్కూల్ దగ్గరికి వెళ్లగా, పక్కింట్లో ఉండే రోషన్ అలీ (60) బాలికను పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె పట్టణ PSలో ఫిర్యాదు చేశారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు.