లారీ, బైక్ ఢీ.. ఇద్దరికి గాయాలు
MNCL: కన్నెపల్లి మండలం టేకులపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో లారీ, బైకు ఢీకొన్న ప్రమాదంలో దహెగాంకు చెందిన పోశం, సంతోశ్‌కు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది కిష్టయ్య, సాదిక్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.