'గోకవరంలో త్వరలోనే బ్రిడ్జి నిర్మాణం'
E.G: గోకవరంలో బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పురాతన బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోగా దాని స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యేకు, కాకినాడ ఎంపీకి, జిల్లా కలెక్టర్‌కు తెలపడం జరిగిందన్నారు. అయితే వారు బ్రిడ్జి నిర్మాణాం చేపడతామని సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.