నిధులపై వివరణ కోరిన ఎంపీ కేశినేని చిన్ని
NTR: సమగ్ర శిక్ష పథకం కింద దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో మంజూరైన నిధులపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని లోక్సభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 1.83 లక్షల పనులకు ఆమోదం లభించగా, ఏపీలో 2,677 పనులకు ఆమోదం లభించి, 1,573 పనులు పూర్తయ్యాయి అని మంత్రి తెలిపారు.