'రైతులు పేరు నమోదు చేసుకోవాలి'
WGL: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు పేర్లు నమోదు చేసుకోవాలని నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. నల్లబెల్లి మండలంలోని ముచ్చింపుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతులు కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.