తొలిదశ ప్రచారం.. లాలూ ప్రసాద్ యాదవ్ రోడ్ షో
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ ముగింపు ప్రచారంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు. ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న పుల్వారీ షరీఫ్ నియోజకవర్గంలో స్థానిక అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసి అతడిని గెలిపించాలని రోడ్ షో నిర్వహించారు. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లాలూ తొలిసారి బయటకు వచ్చి ప్రచారం చేయటం గమనార్హం.