వర్షాలతో సింగరేణికి రూ.46 కోట్ల నష్టం

వర్షాలతో సింగరేణికి రూ.46 కోట్ల నష్టం

BHPL: జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఓపెన్ కాస్ట్ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మలహర్, భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ గనుల్లో 9 రోజుల్లో సుమారు రూ. 46 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. భూపాలపల్లిలోని 2, 3 ఓపెన్ కాస్ట్ గనులలో సుమారు 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగిందని సింగరేణి అధికారులు తెలిపారు.