కారుణ్య నియామకాలపై హైకోర్టు కీలక తీర్పు
TG: కారుణ్య నియామకాలపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. GO 887 ప్రకారం ఈ నియామకాలకు ఏడాదిలోపే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టంచేసింది. ఓ మహిళ రాష్ట్ర హార్టికల్చర్ వర్సిటీలో పనిచేసే తన భర్త 2011లో మరణించగా.. కారుణ్య నియామకానికి 2013లో అప్లై చేసింది. తన దరఖాస్తు రిజెక్ట్ కావడంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారణ సందర్భంగా HC పైవిధంగా తీర్పునిచ్చింది.